Jammu And Kashmir: 6.5 అడుగుల ఎత్తుండే ఉగ్రవాది 'లంబూ' కోసం భారత బలగాల ముమ్మర గాలింపు
- గతేడాది భారత్ లో చొరబడిన భిలాల్ భాయ్
- 'పుల్వామా' బాంబు తయారీదారుడు అతనేనని అనుమానాలు
- శ్రీనగర్ పరిసరాల్లో జల్లెడ పడుతున్న బలగాలు
జమ్మూకశ్మీర్ లో భారత భద్రత బలగాలకు కొన్నిరోజుల క్రితం ఎంతో విలువైన సమాచారం అందింది. ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబూ అనే జైషే మహ్మద్ ఉగ్రవాది శ్రీనగర్ పరిసరాల్లోనే నక్కి ఉన్నాడంటూ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది 6.5 అడుగుల ఎత్తుతో కాస్త విలక్షణంగా ఉంటాడు. ఐఈడీ పేలుడు పదార్థాలను తయారుచేయడంలో దిట్ట.
గతేడాది డిసెంబర్ లో ఇతను భారత్ లోకి చొరబడినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అటు పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా భిలాల్ ఉనికిని ధ్రువీకరించారు. అప్పటినుంచి శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అతడి కదలికలు ఉన్నాయని తెలుసుకున్న ఐబీ వర్గాలు, మొన్నటి పుల్వామా దాడిలో ఉపయోగించిన ఐఈడీ బాంబును స్థానికుల సహకారంతో లంబూనే రూపొందించాడని చెబుతున్నాయి. దాంతో శ్రీనగర్ చుట్టూ 46 కిలోమీటర్ల పరిధిలో భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. గతంలో ఓసారి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన సాయుధ దళాలను ఏమార్చి తప్పించుకున్నాడు లంబూ.