madan: నేను సినిమాలు తీయకుండా ఉండవలసింది: దర్శకనిర్మాత మదన్
- రచయితగా మంచి పేరు
- అభిరుచి కలిగిన దర్శక నిర్మాత
- అప్పటికి ఆ నాలెడ్జ్ వుండదు
సినీ రచయితగా మదన్ కి మంచి పేరు వుంది. 'ఆ నలుగురు' సినిమా ఆయనలో ఎంత గొప్ప రచయిత ఉన్నాడనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. 'ప్రవరాఖ్యుడు' సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన, 'పెళ్లైన కొత్తలో' .. సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరించాడు. నిర్మాతగా ఆయనకి చేదు అనుభవమే మిగిలింది.
తాజాగా ఆయన 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నిర్మాతగా నేను చేసిన సినిమాలు నష్టాలు తెచ్చాయి .. సినిమాల నిర్మాణమనేది నేను చేసి వుండకూడదనిపిస్తుంది. ఒక సినిమా చేయడం వలన అప్పుడున్న కొన్ని పరిస్థితుల నుంచి బయటపడొచ్చునని అనిపిస్తుంది. మనం ఆ పని చేయడం వలన పెనం పై నుంచి పొయ్యిలోకి పడతాం అనే నాలెడ్జ్ అప్పటికి ఉండదు. ఎందుకు నష్టపోయాం అనే ఆలోచన ఆ తరువాతనే కలుగుతుంది" అని చెప్పుకొచ్చారు.