new zealan: న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి.. కాల్పులకు పాల్పడింది ఆస్ట్రేలియా వ్యక్తి
- క్రైస్ట చర్చ్ లో రెండు మసీదులపై కాల్పులు
- ఆస్ట్రేలియా జాతీయుడే కాల్పులకు పాల్పడ్డాడని తెలిపిన ఆసీస్ ప్రధాని
- ప్రస్తుతం ఇంతకు మించి చెప్పలేనన్న మోరిసన్
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు తెగబడ్డారని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. అతివాద భావజాలం కలిగిన టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డాడని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించిన వ్యక్తి అని తెలిపారు. ఘటనపై న్యూజిలాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని... ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంతకు మించి స్పందించలేనని చెప్పారు.