charan: 'వినయ విధేయ రామ' చూస్తుంటే 'గ్యాంగ్ లీడర్' గుర్తొచ్చింది: పరుచూరి గోపాలకృష్ణ
- రెండు సినిమాల కథా వస్తువు ఒకటే
- సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడవు
- సరిగ్గా ఆడకపోవడానికి కారణం అదే
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'వినయ విధేయ రామ' సినిమాను గురించి మాట్లాడారు. 'వినయ విధేయ రామ' సినిమాను చూస్తున్నప్పుడు నాకు 'గ్యాంగ్ లీడర్' గుర్తుకు వచ్చింది. పెద్దన్నయ్యను చంపేస్తే .. అందుకు కారణమైన వాళ్లను హీరో అంతమొందించే కథ ఇది. అందువలన 'గ్యాంగ్ లీడర్' కథా వస్తువు .. ఈ సినిమా కథావస్తువు ఒకటే.
'గ్యాంగ్ లీడర్' సినిమా .. చిరంజీవి 'కల'తో మొదలవుతుంది. అలాగే 'వినయ విధేయరామ' సినిమా కూడా చరణ్ 'కల'తో ఆరంభమైంది. ఇక ఆ సినిమా .. ఈ సినిమా మరోచోట కూడా కనెక్ట్ అయ్యాయి. 'గ్యాంగ్ లీడర్' లో చిరంజీవి పాత్రకి మేము కొణిదెల రాజా రామ్ అనే పేరు పెట్టాము. 'వినయ విధేయ రామ'లో చరణ్ తో ' రామ్ .. కొ .. ణి .. దె .. ల' అని చెప్పించారు. ఆ సినిమాలోవే ఈ సినిమాలో వాడారని కాదు .. నాకు అలా జ్ఞాపకానికి వచ్చాయని చెబుతున్నాను. సస్పెన్స్ .. సెంటిమెంట్ ఒక ఒరలో ఎప్పుడూ ఇమడవు .. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని నా విశ్వాసం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ఇదే కారణమని నాకు అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు.