Karnataka: కర్ణాటక నుంచి రాహుల్ పోటీ చేస్తానంటే స్వాగతమంటున్న రాష్ట్ర నేతలు
- మైత్రిలో భాగంగా దేవెగౌడ గెలుపుకు కృషి
- భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
- రాహుల్ వస్తే సంతోషమే
కర్ణాటక రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని భావిస్తే సాదర స్వాగతం పలుకుతామని ఆ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. రేస్‌కోర్సు రోడ్డులోని తన స్వగృహంలో మంత్రి కృష్ణభైరేగౌడ బెంగళూరు ఉత్తరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గోపాలయ్య, ఎస్.టి.సోమశేఖర్, భైరతి బసవరాజ్, అఖండ శ్రీనివాస మూర్తి, మునిరత్నలతో పాటు రాజ్యసభ సభ్యు డు కుపేంద్రరెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరం నియోజక వర్గం నుంచి దేవగౌడ మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించారని, మైత్రీలో భాగంగా కృషి చేసి, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి లోక్‌సభకు పంపిస్తామని తెలిపారు. అదే సంద్భర్భంగా రాహుల్ పోటీ అంశం ప్రస్తావనకు రాగా, అదే నిజమైతే సంతోషంగా రాహుల్‌కు స్వాగతం పలుకుతామని చెప్పారు.