Rahul Gandhi: మిమ్మల్ని నమ్మడానికి భారతదేశం 'బేవకూఫ్' కాదు: మోదీ ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్
- భారతీయులు వెర్రివాళ్లు కాదు
- మీ గురించి అంతా తెలుసు
- కాంగ్రెస్ విమర్శల దాడి
ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరుతో సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మైభీ చౌకీదార్ (నేను కాపలాదారుడ్ని) అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇండియా బేవకూఫ్ నహీ హై(భారతదేశం వెర్రిది కాదు), సూట్ బూట్ కా చౌకీదార్ (సూటూ బూటు వేసుకున్న వాళ్లకు కాపలాదారు) అనే హ్యాష్ ట్యాగ్ లతో విరుచుకుపడింది.
ప్రధాని మోదీ కేవలం అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామికవేత్తలకే కాపలాదారు అంటూ కాంగ్రెస్ తన ట్వీట్ లో ఆరోపించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విజయ్ మాల్యా, నీవర్ మోదీ, మేహుల్ చోక్సీ, అనిల్ అంబానీ తదితరులతో ప్రధాని మోదీ ఉన్నట్టు ఓ పిక్ ను ట్వీట్ చేశారు. "మై భీ చౌకీదార్ అనే ట్వీట్ తో మీరు ఆత్మరక్షణలో ఉన్నట్టు అర్థమవుతోంది, మీరేమైనా ఈరోజు గిల్టీగా ఫీలవుతున్నారా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.