sumalatha: ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న సుమలత

  • మండ్య నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న సుమలత
  • పొత్తులో భాగంగా జేడీఎస్ కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్
  • బరిలోకి దిగిన కుమారస్వామి కుమారుడు నిఖిల్
సినీ నటి, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత రానున్న లోక్ సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ఈరోజు ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు టికెట్ దక్కకపోవడంతో... స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆమె నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్యను జేడీఎస్ కు కేటాయించారు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.
sumalatha
kumaraswamy
nikhil
mandya
lok sabha elections

More Telugu News