Nara Lokesh: చంద్రగిరి ఎందుకు... పక్కనే మంగళగిరి ఉందని నాన్న చెప్పారు: నారా లోకేశ్
- ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నా
- సీఎంను అడిగితే మంగళగిరి పేరు చెప్పారు
- మంచి మెజారిటీతో గెలిపించండి
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచారు. ఈ ఉదయం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆయన, పలువురు నాయకులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.
"మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నా. అప్పుడు ముఖ్యమంత్రిగారిని అడిగితే ఒకటే మాట చెప్పారు. చంద్రగిరి అవసరం లేదు. మన పక్కనే మంగళగిరి ఉందీ... మంగళగిరిలో పోటీ చెయ్. ప్రజలతో మమేకమవ్వు. ప్రజల అభిమానం పెంచుకున్న తరువాతనే శాసనసభలో అడుగుపెట్టు అని ముఖ్యమంత్రిగారు చెప్పారు. అందుకే నన్ను గెలిపించండి. మంచి మెజారిటీతో గెలిపించి, శాసనసభకు పంపించాలని సభా ముఖంగా కోరుతున్నా. రాబోయే ఎన్నికల్లో మనకు రెండు ఓట్లు ఉంటాయ్. ఈ రెండు ఓట్లూ సైకిల్ గుర్తుకే వేయాలని కోరుకుంటున్నా" అంటూ లోకేశ్ విజ్ఞప్తి చేశారు.