Justice Pinaki Chandra Ghose: భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌‌.. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి భవన్

  • తొలి లోక్‌పాల్‌గా రికార్డులకెక్కనున్న జస్టిస్ పినాకి
  • సభ్యులుగా 8 మంది నియామకం
  • ఇక ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపై దృష్టి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌‌ను లోక్‌పాల్‌గా నియమించినట్టు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. లోక్‌పాల్‌లో నాన్ జుడీషియల్ సభ్యులుగా సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) మాజీ చీఫ్ రామ సుందరం, మహారాష్ట్ర మాజీ సీఎస్ దినేశ్ కుమార్ జైన్,  మహేంద్ర సింగ్‌, ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లు నియమితులయ్యారు. జుడీషియల్ సభ్యులుగా జస్టిస్‌ దిలీప్‌ బి. భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠీలు నియమితులయ్యారు. లోక్‌పాల్‌గా నియమితులైన తొలి వ్యక్తిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ రికార్డులకెక్కారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వీరి నియామకాలు అమల్లోకి రానున్నాయి.
 
2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ఆమోదం పొందింది. కేంద్రస్థాయిలో దీనిని లోక్‌‌పాల్‌గా వ్యవహరించనుండగా, రాష్ట్రస్థాయిలో దీనిని లోకాయుక్తగా పిలుస్తారు. కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి కేసులపై లోక్‌పాల్ దృష్టి సారిస్తుంది.

  • Loading...

More Telugu News