sumalatha: దూరదర్శన్ లో సుమలత, నిఖిల్ సినిమాలకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం

  • మాండ్య నుంచి పోటీ చేస్తున్న సుమలత, నిఖిల్
  • వీరి సినిమాలు ఓటర్లపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డ ఎన్నికల సంఘం
  • ఏప్రిల్ 18న మాండ్య స్థానానికి పోలింగ్
కర్ణాటకలోని మాండ్య లోక్ సభ స్థానానికి ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు దూరదర్శన్ లో సుమలత, నిఖిల్ కుమారస్వామిల సినిమాలను ప్రదర్శించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. వీరిద్దరూ సినిమా నటులు కావడంతో... వారి సినిమాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు మాండ్య రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కమిషనర్ మంజుశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ఉత్తర్వులు థియేటర్లు, ప్రైవేట్ ఛానళ్లకు వర్తించవని ఆమె చెప్పారు.

ఏప్రిల్ 18న రెండో దశలో భాగంగా మాండ్య నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. సుమలత, సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ స్థానం నుంచి బరిలోకి దిగారు. సుమలతకు దర్శన్, యష్ లాంటి కన్నడ సినీ స్టార్లు మద్దతు తెలుపుతున్నారు.
sumalatha
nikhil
mandya
ec

More Telugu News