Maganti Rupa: భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మాగంటి రూప
- డ్వాక్రా సంఘాల ద్వారా సాయం
- మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం
- పసుపు-కుంకుమ ద్వారా చేయూత
టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో సాయం అందిస్తున్నారని ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప తెలిపారు. నేడు ఆమె రాజమండ్రి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటి నుంచి మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన రూప నగరపాలక సంస్థలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పసుపు-కుంకుమ ద్వారా మహిళలకు చేయూతనందిస్తున్నారని తెలిపారు. టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును టీడీపీయే కల్పించిందని తెలిపారు.