Andhra Pradesh: వైసీపీ 'ఆడరౌడీ'లను పెంచి పోషిస్తోంది: సినీ నటి దివ్యవాణి

  • ఏపీలో ‘హంగ్’ ఏర్పడే ప్రసక్తే లేదు
  • హండ్రెడ్ పర్సెంట్ మాదే మెజార్టీ
  • ‘నవరత్నాలు’ కాదు ‘నవ అక్రమాలు’ 

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపుపై ఆయా పార్టీల అధినేతలు, నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మిర్రర్ టీవీ’కి  ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ సినీ నటి దివ్యవాణి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ద్విముఖ పోటీ ఉంటుందా లేక త్రిముఖ పోటీ ఉంటుందా?
  
దివ్యవాణి : వెయిట్ అండ్ సీ. చూద్దాం..

హంగ్ వచ్చే అవకాశం ఉందా?

దివ్యవాణి :  అంటే? (పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం అని వ్యాఖ్యాత వివరించి చెప్పారు) అలా ఏమీ ఉండదు. హండ్రెడ్ పర్సెంట్ మాదే మెజార్టీ

ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు?

దివ్యవాణి : చూద్దాం. ఇంకో ట్వంటీ డేస్ లో తెలుస్తుంది. మా చంద్రబాబు గారు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేశారు. ఈరోజు అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాన్ని ఇవ్వడమే గిఫ్ట్.

ఉత్తరాంధ్ర నుంచి అని చెప్పి మంగళగిరి నుంచి లోకేశ్ ను పోటీ చేయిస్తున్నారు?
దివ్యవాణి : అది చంద్రబాబు గారి నిర్ణయం.

గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదంటున్నారు?

దివ్యవాణి :  అలా ఉండదనుకుంటున్నా.

రాయలసీమకు నీళ్లిచ్చి ‘రతనాల సీమ’గా మార్చారు. రాయలసీమలో స్థానిక నేతలకు పాజిటివ్ ధింకింగ్ వస్తుందా?

దివ్యవాణి :  కచ్చితంగా రావాలి. నేను ఒకటే చెబుతున్నాను. చంద్రబాబు ఎంతగా కష్టపడుతున్నారో మనస్సాక్షి గల వారికి తెలుస్తుంది. ‘నవరత్నాలు’ వస్తాయని చెప్పుకుంటున్నారు. ‘నవ అక్రమాలు’ వస్తాయి. వైసీపీ ఆడరౌడీలను పెంచి పోషిస్తోంది. అటువంటి పరిపాలన మా రాష్ట్ర ప్రజలు కోరుకోవట్లేదు.

మీరు ఎవరిని అయితే ‘ఆడరౌడీ’ అని విమర్శించారో..ఆమెను అందరూ ‘ఫైర్ బ్రాండ్‘ అంటున్నారుగా!

దివ్యవాణి :  ‘ఫైర్ బ్రాండ్‘ అంటే అర్థమేంటి?  వివేకానందరెడ్డి చనిపోయారంటే దానికి కారణం చంద్రబాబే అనడం ఫైర్ బ్రాండా? కొడితే సింగపూర్ లో పడతావని ఒక అనుభవం కలిగిన నాయకుడిని అనడం ఫైర్ బ్రాండా? న్యాయం కోసం, రాష్ట్రం కోసం పోరాడే వాళ్లు ‘ఫైర్ బ్రాండ్స్’.

మిమ్మల్ని టీడీపీ ఫైర్ బ్రాండ్ అంటున్నారు?

దివ్యవాణి: నాకు ఏ బ్రాండ్లూ అంటగట్టొద్దు. నీతినియమాలు కలిగిన బ్రాండ్ అని నాకు వస్తే చాలా సంతోషపడతాను.  

  • Loading...

More Telugu News