Actress Sumalatha: స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నటి సుమలత.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు

  • మాండ్యా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సుమలత
  • మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ
  • జేడీఎస్ నుంచి సీఎం కుమారుడు నిఖిల్ పోటీ
రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రముఖ నటి సుమలతా అంబరీష్ మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బుధవారం తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేసిన సుమలత.. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి జూబ్లీ పార్క్ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన భర్త అంబరీష్ హఠాన్మరణంతో సుమలత రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాండ్యా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించారు. అయితే, కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పొత్తులో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలత అసంతృప్తికి గురయ్యారు. ఎలాగైనా మాండ్యా నుంచి పోటీ చేయాల్సిందేనని భావించిన ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. మాండ్యా నుంచి జేడీఎస్ తరపున సీఎం కుమారస్వామి తనయుడు, సినీ నటుడు నిఖిల్ బరిలో ఉన్నారు. దీంతో మాండ్యా పోరు రసవత్తరంగా మారింది.
Actress Sumalatha
Mandya
Karnataka
Kumaraswamy
Actor Nikhil

More Telugu News