shark-themed plane: ఢిల్లీ విమానాశ్రయంలో షార్క్‌ చేపను పోలిన విమానం.. సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రయాణికులు!

  • తొలిసారి ఢిల్లీ వచ్చిన షార్క్ ఆకారంలోని విమానం
  • చూసేందుకు పోటెత్తిన ప్రయాణికులు
  • ఫొటోను పోస్టు చేసిన ఢిల్లీ విమానాశ్రయం

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు బుధవారం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వారిలో ఆ అనుభూతి కలగడానికి కారణం మరేంటో కాదు.. ఓ పేద్ద షార్క్ చేపను పోలి ఉన్న విమానం ల్యాండ్ కావడమే. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఆకాశంలో చక్కర్లు కొడుతుండడాన్ని చూసిన ఢిల్లీ వాసులు తొలుత ఆశ్చర్యపోయారు. తర్వాత తేరుకుని అది విమానమని గ్రహించి కళ్లప్పగించి చూశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఢిల్లీ విమానాశ్రయం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

షార్క్ చేప ఆకారంలో ఉన్న ఎంబ్రాయర్ ఈ190-ఈ2 వాణిజ్య విమానం బుధవారం తొలిసారి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన టిబెట్‌ లాషాలోని గోంగార్ ఎయిర్‌పోర్టులో గతేడాది షార్క్ ఆకారంలో ఉన్న విమానం లాండ్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. దీనిని చూసేందుకు విమాన ప్రయాణికులు ఆసక్తి చూపించారు.

  • Loading...

More Telugu News