rashmika: 'డియర్ కామ్రేడ్' నుంచి వచ్చిన టీజర్ .. విమర్శలపై స్పందించిన రష్మిక
- రష్మిక తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
- కావాలని ఆ సీన్ పెట్టలేదు
- నా పాత్రకు న్యాయం చేయడం నా బాధ్యత
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. రష్మిక మందన నాయికగా 'డియర్ కామ్రేడ్' సినిమా నిర్మితమైంది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ ను వదిలారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య ఒక లిప్ లాక్ సీన్ వుంది. ఈ టీజర్ విడుదలైన దగ్గర నుంచి విమర్శలు మొదలయ్యాయి.
అవకాశాల కోసం రష్మిక లిప్ లాక్ సీన్స్ కి సిద్ధమైందనీ .. లిప్ లాక్ సీన్స్ సినిమాను నడిపించలేవనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఇక కన్నడ నాట కూడా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ .. ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగినట్టుగా ఈ సన్నివేశం వస్తుంది. పాత్ర .. సన్నివేశం డిమాండ్ చేయడం వలన ఆ సీన్ చేశాను గానీ .. ఆ సీన్ కావాలని క్రియేట్ చేసింది కాదు. మరిన్ని అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చేసింది అసలే కాదు. నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయవలసిన బాధ్యత నాపై వుంది" అని ఆమె చెప్పుకొచ్చింది.