Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఎవరికీ భయపడనంటున్న కాజల్
- సోషియో ఫాంటసీ కథతో కల్యాణ్ రామ్
- మరో సీక్వెల్ లో నాగార్జున!
* తాను ఎవరికీ, దేనికీ భయపడనని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఎదుటి వాళ్లని గౌరవిస్తాను, ఎవరేం చెప్పినా వింటాను. అంతమాత్రాన వాళ్లకు తల ఊపేయను. నేను చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పేస్తాను. ఈ విషయంలో మాత్రం నాకు భయం లేదు. అందుకే, నా దగ్గర ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోలేరు' అని చెప్పింది కాజల్.
* '118' చిత్రం తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథతో రూపొందుతుందట.
* గతంలో వచ్చిన 'రాజుగారిగది' చిత్రానికి మరో సీక్వెల్ తీసుకురావడానికి దర్శకుడు ఓంకార్ ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన 'రాజుగారిగది 2' సక్సెస్ కానప్పటికీ మూడో భాగాన్ని తీయాలని ఓంకార్ నిర్ణయించుకుని, నాగార్జునను సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజక్టు పట్ల నాగార్జున కూడా ఆసక్తి చూపుతున్నాడట.