Knowledge: ఆంగ్ల పదం 'కెనౌలెడ్జే'... అర్థం తెలియాలంటే ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియో చూడాల్సిందే!
- బోర్డుపై 'నాలెడ్జ్' అన్న పదం
- స్పెల్లింగ్ చెబుతూ తప్పుగా పలికిన టీచర్
- లాజిక్ లేని స్పెల్లింగన్న ఆనంద్ మహీంద్రా
తన వద్దకు వచ్చిన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా, ఇప్పుడు మరో వీడియోను పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్ అందుతోంది. ఓ ఆంగ్ల టీచర్ 'నాలెడ్జ్' అన్న పదాన్ని బోర్డు మీద రాసి, దాని స్పెల్లింగ్ చెబుతూ 'కెనౌలెడ్జే' అని పలకడమే ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. వాస్తవానికి లాజిక్ అందని ఆంగ్ల పదాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలానే ఉన్నాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసుకున్న వీడియోకు క్యాప్షన్ పెడుతూ, "ఇది కొంతకాలంగా తిరుగుతూ, నా వాట్స్ యాప్ బాక్స్ లోకి వచ్చి చేరింది. ఇది కొంచెం ఫన్నీగానే ఉంది. ఇదే సమయంలో లాజిక్ లేని ఆంగ్ల స్పెల్లింగ్ ఇది. భారతీయులను తక్కువ అంచనా వేసేలా ఉంది" అని కామెంట్ చేశారు.
This has been going around as a source of amusement & landed in my #whatsappwonderbox Yup, it’s funny, but I think it also underscores how practical Indians are & how illogical English spelling is!! pic.twitter.com/phVzBge1Yk
— anand mahindra (@anandmahindra) March 17, 2019