Japan: 'మీటూ' తరహాలో జపాన్ లో 'కూటూ' ఉద్యమం
- హైహీల్స్ వాడకంపై ఉద్యోగినుల్లో అసంతృప్తి
- ఆన్ లైన్ లో విస్తృత ప్రచారం
- ఆఫీసుల్లో స్త్రీ, పురుషుల మధ్య తేడాలెందుకంటూ ఉద్యమం
కొన్నాళ్ల కిందట 'మీటూ' ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు జపాన్ లో అదే తరహాలో సామాజిక వేదికల అండగా కూటూ ఉద్యమం పురుడుపోసుకుంది. జపాన్ కార్యాలయాల్లో ఉద్యోగినులకు సూట్ తో పాటు హైహీల్స్ ను తప్పనిసరి చేయడాన్ని అక్కడి మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేస్తున్నంత సేపు హైహీల్స్ ధరించడం కారణంగా కాళ్లలో రక్తప్రసరణ తగ్గడంతోపాటు, గాయాలపాలయ్యే అవకాశముందని జపనీస్ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 'కూటూ' పేరుతో ఆన్ లైన్ ఉద్యమానికి తెరలేపారు. పురుషులను, స్త్రీలను వేర్వేరుగా చూడడం ఎందుకని జపాన్ ఉద్యోగినులు ప్రశ్నిస్తున్నారు. జపనీస్ భాషలో 'కూట్సు' అంటూ బూట్లు అనే అర్థం వస్తుంది. అందులోంచి మొదటి అక్షరాన్ని తీసుకుని 'కూటూ' పేరుతో ఉద్యమం లేవనెత్తారు.