GVL: టీడీపీ ధన బలంతో గెలవాలని చూస్తోంది...ఈసీ అడ్డుకోవాలి: జీవీఎల్‌

  • ఏపీలో ప్రధాన పక్షాలు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నాయి
  • అవినీతి ప్రభుత్వాలు ప్రజాసేవ చేయలేవు
  • ధన ప్రవాహం కనిపిస్తే వీడియోతీసి సీవీజీఎల్‌ యాప్‌కు పంపండి

సార్వత్రిక ఎన్నికల్లో ధన బలంతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని, ఎన్నికల అధికారులు దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఏపీలో అంచనాలకు మించి డబ్బు పంపిణీ జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

 తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి పరులు ప్రజాసేవ చేస్తారనుకోవడం ఒట్టి భ్రమేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పక్షాలు రానున్న ఎన్నికల్లో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఎన్నికల సంఘం మరింత మంది నిఘా అధికారులను నియమించి విచ్చలవిడిగా డబ్బు పంపిణీని అడ్డుకోవాలని కోరారు. వేల కోట్ల నల్ల ధనం మార్కెట్‌కు వస్తోందని, డబ్బు పంపిణీని ఎవరైనా చూస్తే వీడియోతీసి సీజీవీఎల్‌ యాప్‌కు షేర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News