national day: పాకిస్థాన్ జాతీయ దినోత్సవం...ట్విట్టర్లో ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- శాంతిసామరస్యాలు ఇరు దేశాలకు అవసరం
- ఉగ్రరహిత ప్రపంచం కోసం ఇరుదేశాల ప్రజలు పనిచేయాలని పిలుపు
- ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఇమ్రాన్
పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చెరిపేస్తూ ప్రధాని మోదీ పాకిస్థాన్‌తో స్నేహగీతం ఆలపించారు. ఈ రోజు ఆ దేశ జాతీయ దినోత్సవాన్ని పురష్కరించుకుని ట్విట్టర్లో మోదీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిసామరస్యాలు, ఉగ్రరహిత ప్రపంచం కోసం ఇరుదేశాల ప్రజలు ఐక్యంగా పనిచేయాల్సిన సమయం ఇదని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని స్వయంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్విట్టర్లో వెల్లడించడం విశేషం.