lokpall: తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణ స్వీకారం
- ప్రమాణం చేయించిన రాష్ట్రపతి కోవింద్
- హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం చీఫ్ జస్టిస్
- అపెక్స్ కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన లోక్‌పాల్
దేశఅత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన లోక్‌పాల్ వ్యవస్థకు తొలి చీఫ్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త నియామకానికి ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.
లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్ ఘోష్‌ను చీఫ్‌గా ఎంపిక చేసింది. జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషా కుమారి, జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠిలను జ్యుడిషియల్ సభ్యులుగా ఎంపిక చేశారు.
అలాగే పారా మిలటరీ దళం ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్ఎస్బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్‌తోపాటు మహేంద్ర సింగ్, ఇందర్జీత్ ప్రసాద్ గౌతమ్‌లను నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియమించారు.