BJP: సుమలతకు అనూహ్య మద్దతు... అండగా నిలుస్తామన్న బీజేపీ!

  • మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
  • ఆమె విజయానికి కృషిచేస్తాం
  • కేంద్ర మంత్రి జేపీ నడ్డా
కర్ణాటకలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న దివంగత నటుడు అంబరీశ్ భార్య సుమలతకు అనూహ్య మద్దతు లభించింది. సుమలతకు తాము మద్దతిస్తున్నామని, ఆ స్థానంలో పోటీని పెట్టబోమని బీజేపీ వెల్లడించింది.

లోక్‌సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల తాజా జాబితాను విడుదల చేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, సుమలత విజయానికి తమ కార్యకర్తలంతా కృషి చేస్తారని అన్నారు. కాగా, గతంలో అంబరీశ్ కాంగ్రెస్ తరఫున మాండ్యా నుంచి పలుమార్లు గెలుపొందగా, ఆయన మరణానంతరం అదే స్థానాన్ని సుమలతకు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించిన సంగతి తెలిసిందే. జేడీఎస్ తో పొత్తులో భాగంగా, మాండ్యా లోక్ సభను ఆ పార్టీకి ఇవ్వగా, ఇక్కడి నుంచి నటుడు నిఖిల్ గౌడను జేడీఎస్ బరిలోకి దించింది. దీంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
BJP
Sumalata
Mandya
Karnataka

More Telugu News