Nama Nageswara Rao: నామా, తుమ్మల చొరవతో వెనక్కి తగ్గిన ఖమ్మం రైతులు
- కేసీఆర్‌తో మాట్లాడి ఆదుకుంటాం
- 15 రోజులు నాకోసం కష్టపడండి
- సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తా
ఖమ్మం రైతులు తాము వేసిన నామినేషన్లను మాజీ మంత్రి తుమ్మల చొరవతో ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జామాయిల్, సుబాబుల్ రైతులను ఆదుకుంటామని తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు హామీ ఇవ్వడంతో రైతులు వెనక్కి తగ్గారు.
నామాను ఎంపీగా గెలిపించి, అనంతరం ఆయన ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. నామా కూడా ఎంపీగా గెలిచిన అనంతరం కేంద్రంతో మాట్లాడి రైతు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకోసం ఒక్క 15 రోజులు కష్టపడాలని రైతులను నామా కోరారు.