Salman Khan: మరో కొరియన్ మూవీ రీమేక్ పై దృష్టిపెట్టిన సల్మాన్ ఖాన్
- 'భరత్' పనుల్లో బిజీగా సల్మాన్
- మరో కొరియన్ మూవీ హక్కులు సొంతం
- త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఒకప్పుడు తెలుగు సినిమాల రీమేక్ లపై ఆసక్తి చూపిన సల్మాన్ ఖాన్, ఇప్పుడు కొరియన్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ .. 'భరత్' సినిమా చేస్తున్నాడు. 'ఓడ్ టు మై ఫాదర్' అనే కొరియన్ మూవీకి ఇది రీమేక్. జూన్ 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
ఒక వైపున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా పనులను పూర్తి చేస్తూనే, మరో వైపున మరో కొరియన్ మూవీని రీమేక్ చేస్తున్నట్టుగా కూడా సల్మాన్ స్పష్టం చేశాడు .. ఆ కొరియన్ మూవీయే 'వెటరన్'. సల్మాన్ బావ అతుల్ అగ్నిహోత్రి ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సల్మాన్ చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.