Rajasthan: రాజస్థాన్ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. తాను బీజేపీ కార్యకర్తనని వ్యాఖ్య

  • బీజేపీ మళ్లీ గెలిచి మోదీ ప్రధాని కావాలన్న గవర్నర్
  • మండిపడుతున్న ప్రతిపక్షాలు
  • రాజ్యాంగ పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలేంటని ఆగ్రహం

రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తామంతా బీజేపీ కార్యకర్తలమని, ఆ పార్టీ గెలవాలని, మోదీ మరోమారు ప్రధాని కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావడం ఈ దేశానికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించి రాజకీయ దుమారం రేపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడమేంటంటూ కాంగ్రెస్ నేతలు కల్యాణ్ సింగ్‌పై మండిపడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థి ఒక్కసారి కూడా తమ నియోజకవర్గంలో పర్యటించలేదని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు అలీగఢ్‌లోని గవర్నర్ కల్యాణ్ సింగ్ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. అలాంటి వ్యక్తికి తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన గవర్నర్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెబుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News