mohanbabu: 'చంద్రబాబుకు నవ రంధ్రాలు' అనే పదాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు: మోహన్ బాబు
- ఏ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ నాకు ఉంది
- 15 సంవత్సరాల క్రితమే పదవులను అనుభవించా
- చంద్రబాబుకు నేను భయపడను
ఒక పౌరుడిగా ఏ పార్టీలో అయినా చేరే స్వేచ్ఛ తనకుందని మోహన్ బాబు అన్నారు. వైసీపీలో చేరడానికి తాను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 15 సంవత్సరాల క్రితమే పదవులను అనుభవించానని... ఇప్పుడు పదవులపై తనకు మమకారం లేదని తెలిపారు. గతంలో ఒకసారి బీజేపీ సీనియర్ నేత అద్వానీ కారులోకి వెంకయ్యనాయుడు తనను ఎక్కించారని... ఆయనతో కలసి చెన్నై వరకు తాను ప్రయాణించానని చెప్పారు. నిజాయతీపరుడు, ముక్కుసూటి మనిషని మీ గురించి తాను విన్నానని అద్వానీ చెప్పారని అన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ సభలో వాజ్ పేయి తనను కౌగిలించుకున్నారని చెప్పారు.
సమాజంలో ఏదైనా తప్పుడు పని చేసినప్పుడే తల దించుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకొని చనిపోవాలని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబుకు తాను భయపడనని చెప్పారు. 'చంద్రబాబుకు నవ రంధ్రాలు' అనే పదాన్ని తాను ఎప్పుడూ ఉపయోగించలేదని అన్నారు. తనకు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు ఒకటేనని చెప్పారు. హైదరాబాదులోని ఉప్పల్ లో తనకు స్కూల్ ఉందని, ఇప్పుడు హాస్టల్ కూడా కడుతున్నామని... తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సింది ఏమీ లేదని... టీఎస్ ప్రభుత్వం సహకారం మాత్రం తమకు ఉందని చెప్పారు.