narsi reddy: టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తుగా ఉండను: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేత నర్సిరెడ్డి
- ఇది రాష్ట్రంలోని అధ్యాపకుల గెలుపు
- తెలంగాణలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది
- విద్య ప్రైవేటీకరణలో మాత్రం దేశంలోనే ముందుంది
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన పూల రవీందర్ పై నర్సిరెడ్డి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాష్ట్రంలోని అధ్యాపకుల గెలుపని చెప్పారు. తన కోసం గత ఆరు నెలలుగా శ్రమించిన ప్రతి కార్యకర్తకూ ఈ గెలుపును అంకితం చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ ధ్వంసమైందని.. దాని పునర్నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వానికి తొత్తుగా ఉండనని చెప్పారు. అక్షరాస్యతలో తెలంగాణ వెనుకబడి ఉందని... విద్య ప్రైవేటీకరణలో మాత్రం దేశంలోనే ముందు స్థానంలో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని అన్నారు.