ys viveka: వివేకా హత్య కేసులో అరెస్టులను అడ్డుకునేందుకే ఎస్పీపై వేటు: ఆదినారాయణరెడ్డి
- ఆయన్ని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు
- సిట్ దర్యాప్తు ముందుకు వెళ్లకూడదని ప్లాన్
- దోషులుగా మిగులుతామన్న భయంతోనే
జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ఒకటి రెండు రోజుల్లో అరెస్టులు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో కడప ఎస్పీపై ఈసీ వేటు వేయడం వ్యూహాత్మకమేనని, అరెస్టులను అడ్డుకుని దోషులు బయటపడకుండా ఉండేందుకేనని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ సిట్ దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో వాళ్ల కాళ్లకు బంధం వేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమన్నారు. అసలు ఎస్పీరాహుల్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని, సీనియర్ న్యాయవాదులు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. జగన్ కుటుంబీకులే దోషులు కాబట్టి ఇరుక్కుంటే ప్రజలు అసహ్యించుకుంటారని, డిపాజిట్లు కూడా రావని ఈ కుట్రకు తెరదీశారని ఆరోపించారు.