Tipu Sultan: వేలంలో రూ.54.76 లక్షలు పలికిన టిప్పు సుల్తాన్ తుపాకి, బాకు

  • టిప్పు సుల్తాన్ వస్తువులకు విపరీతమైన డిమాండ్
  • 1799 శ్రీరంగపట్నం యుద్ధంలో ఓడిన టిప్పు
  • విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ

బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో టిప్పు సుల్తాన్ తుపాకి, బాకులకు భారీ ధర పలికింది. 107,000 పౌండ్ల (రూ.54.76 లక్షలకు పైగా) కు ఇద్దరు వ్యక్తులు వేలంలో వీటిని దక్కించుకున్నారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి చెందిన ఓ అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తుల నుంచి వీటిని సేకరించినట్టు వేలం సంస్థ ప్రకటించింది.  

మైసూరును పాలించిన రాజుల్లో టిప్పు సుల్తాన్ చివరివాడు. ఆయన వాడినట్టుగా చెబుతున్న వెండి తొడుగు కలిగిన 20 బోర్ ఫ్లింట్‌లాక్ గన్‌ను వేలానికి ఉంచగా మొత్తం 14 బిడ్లు దాఖలయ్యాయి. గన్‌ను ఓ వ్యక్తి 60 వేల పౌండ్లకు సొంతం చేసుకున్నాడు. అలాగే బంగారం తాపడంతో చేసిన కత్తి (బాకు)ని దక్కించుకునేందుకు 58 మంది బిడ్లు దాఖలు చేశారు. దీనిని 18,500 పౌండ్లకు ఓ బిడ్డర్ సొంతం చేసుకున్నాడు. కాగా, 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాక ఆయనకు చెందిన విలువైన వస్తువులను ఈస్టిండియా కంపెనీకి చెందిన మేజర్ థామస్ హర్ట్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఈ తుపాకి, బాకు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News