sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- ఉదయం నుంచి లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు
- 413 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 125 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ట్రేడింగ్ ముగిసేంత వరకు అదే ఊపును కొనసాగించాయి.బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ తదితర స్టాకుల్లో కొనుగోళ్లతో మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 413 పాయింట్లు లాభపడి 38,546కు చేరుకుంది. నిఫ్టీ 125 పాయింట్లు పుంజుకుని 11,570కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.36%), యస్ బ్యాంక్ (2.71%), యాక్సిస్ బ్యాంక్ (2.64%), సన్ ఫార్మా (2.49%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.73%), ఓఎన్జీసీ (-1.65%), బజాజ్ ఆటో (-1.53%), ఎన్టీపీసీ (-0.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.71%).