Jagan: ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో విలీనం కానున్న వైసీపీ: పంచుమర్తి అనురాధ
- టీఆర్ఎస్తో కలిస్తే తప్పేంటన్న వ్యాఖ్యలపై అనురాధ విమర్శలు
- ప్రభుత్వ పథకాలను విమర్శించే ముందు వాటి గురించి తెలుసుకోవాలని హితవు
- నవరత్నాలు అంటే నవగ్రహాలను మింగేయడమేనని విమర్శ
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలీనం కావడం తథ్యమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ చేపడుతున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేసేముందు ప్రజలు వాటి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకమంటే నవగ్రహాలను మింగేయడమేనన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తి ప్రతిపక్ష నేతగా కూడా ఉండడానికి తగడని అనురాధ విమర్శించారు. టీఆర్ఎస్తో కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న జగన్ ఎన్నికల తర్వాత తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయడం పక్కా అని అనురాధ తేల్చి చెప్పారు.