nayan: 'ఐరా' స్పందనపై నయన్ అభిమానుల ఆందోళన

  • తొలిసారిగా నయన్ ద్విపాత్రాభినయం 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • తమిళనాట వినిపించని పాజిటివ్ టాక్   

తమిళంలో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఆమె సినిమాలు చూడటానికి అక్కడ జనం ఎగబడతారు. ముఖ్యంగా ఆమె చేసే హారర్ థ్రిల్లర్ సినిమాలకి అక్కడ వసూళ్లు భారీగా ఉంటాయి. గతంలో నయన్ చేసిన ఆ తరహా సినిమాలు ఘన విజయాలను అందుకోవడమే అందుకు కారణం. అలా ఆమె తాజా చిత్రంగా తమిళంలో రూపొందిన 'ఐరా' .. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో నయన్ ద్విపాత్రాభినయం చేయడం ఒక విశేషమైతే .. డీ గ్లామరైజ్డ్ పాత్రను పోషించడం మరో విశేషం. పోస్టర్స్ నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సినిమా, అక్కడ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే తొలి రోజున ఈ సినిమా చూసినవాళ్లంతా ఆశించిన స్థాయిలో లేదని చెప్పుకుంటున్నారట. హారర్ థ్రిల్లర్ చిత్రాలను తన క్రేజ్ తో విజయం వైపుకు నడిపించే నయన్ కు ఈ సారి పరాజయం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం అభిమానులకు ఆందోళనను కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 

  • Loading...

More Telugu News