pawan kalyan: 'కొణిదెల' గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్ కల్యాణ్
- నా ఇంటి పేరైన గ్రామానికి రావడం సంతోషంగా ఉంది
- రాయలసీమను కల్పతరువు సీమగా మార్చుతా
- 10 ఏళ్లు పన్ను రాయితీలను కల్పిస్తా
రాయలసీమను కరువుసీమగా కాదు, కల్పతరువు సీమగా మార్చుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీమలోని నాలుగు జిల్లాలను 10 ఏళ్ల పాటు కరువు జిల్లాలుగా ప్రకటించి... పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీలను కల్పిస్తానని చెప్పారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కొణిదెల గ్రామంలో హెలికాప్టర్ లో ఆయన దిగారు. ఈ సందర్భంగా పవన్ కు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. అక్కడి రైతులు, ఆడపడుచులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన ఇంటిపైరేన ఈ ఊరికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు.