hardik patel: పార్లమెంటులో అడుగుపెట్టాలన్న హార్దిక్ పటేల్ ఆశలపై నీళ్లు చల్లిన గుజరాత్ హైకోర్ట్

  • రెండేళ్ల శిక్షపై స్టే విధించాలంటూ కోర్టును కోరిన హార్దిక్
  • తిరస్కరించిన హైకోర్టు
  • కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైన హార్దిక్

పటిదార్ ఉద్యమనేత, కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన హర్దిక్ పటేల్... ఆ శిక్షపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్ పై 24 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని, అందులో రెండు దేశద్రోహ కేసులున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హార్దిక్ విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్షపడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మరోవైపు, ఏప్రిల్ 4వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో హార్దిక్ ఉన్నారు.

  • Loading...

More Telugu News