rajani: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రజనీ .. నయన్ మూవీ

  • మురుగదాస్ తో రజనీకాంత్ 
  • చాలా కాలం తరువాత పోలీస్ ఆఫీసర్ పాత్ర
  • ఏప్రిల్ 10న షూటింగ్ మొదలు  

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా .. సామాజిక సేవకుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఆయన సరసన నయనతారను .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా రజనీని తెరపై ఆయన అభిమానులు చూసి చాలా కాలమే అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మురుగదాస్, ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడని అంటున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి తెలుగు .. తమిళభాషల్లోని మిగతా సినిమాలకి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వనుందన్న మాట. 

  • Loading...

More Telugu News