KTR: 10 సీట్లు కూడా గెలవలేని పార్టీలు జాతీయపార్టీలు ఎలా అవుతాయి?: కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదు
- ఆ పార్టీల వల్ల ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి
- ప్రధాన సమస్యలను పట్టించుకున్నది లేదు
ఐదేళ్లు అధికారంలో ఉన్న మోదీ చేసిన ఒకే ఒక్క పని, నోట్ల రద్దుతో సామాన్యుల నోట్లో మట్టి కొట్టడమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నేడు ములుగులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 71 ఏళ్లు పూర్తవుతోందని కానీ కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కుంభకోణాలపై ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకోవడం తప్ప దేశంలోని ప్రధాన సమస్యలను పట్టించుకున్నది లేదని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కంటే కొంచెం పెద్దవి మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానాలు 130 ఉంటే, 10 స్థానాలు కూడా గెలవలేని పార్టీలు ప్రాంతీయ పార్టీలెలా అవుతాయని ప్రశ్నించారు. అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమనడాన్ని ఖండించిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ వల్ల ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు.