Germany: మ్యూనిచ్ లో ఇండియన్ కపుల్ పై దాడి... భర్త మృతి, చావుబతుకుల మధ్య భార్య!

  • ప్రశాంత్, స్మితలపై కత్తితో దాడి
  • దాడికి పాల్పడిన వలసదారుడు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

జర్మనీలోని మ్యూనిచ్ లో భారతీయ దంపతులపై దాడి జరుగగా, భర్త మృతి చెందగా భార్య చావు బతుకుల మధ్య ప్రాణాల కోసం పోరాడుతోంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండియన్ కపుల్ ప్రశాంత్, స్మితా బసరుర్‌ లపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్‌ మృతి చెందారు. స్మితా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, దాడికి పాల్పడిన ఓ వలసదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, వారి బాగోగులను చూసుకోవాలని జర్మనీలోని దౌత్యాధికారులను కోరినట్టు సుష్మా వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని అక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, భారతీయ దంపతులపై జరిగిన దాడి గురించి వెల్లడించిన సుష్మాపై ట్విట్టర్ ఫాలోవర్ ఒకరు స్పందిస్తూ, సహృదయులైన మీరు, పేరుకు ముందుగా 'చౌకీదార్‌' అని ఎందుకు ఉంచుకున్నారు? అని అడిగాడు. దీనిపై ఆమె స్పందిస్తూ,  "విదేశాల్లో ఉంటున్న మనవారి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ (కాపలా) పని చేస్తున్నందునే అలా పెట్టుకున్నాను" అని తెలిపారు.

  • Loading...

More Telugu News