Telangana: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

  • మూడు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • రామగుండం, పెంబి, బయ్యారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత
  • జమ్మికుంట  మండలం తంగులలో 43.2 డిగ్రీలు

తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మూడు ప్రాంతాల్లో ఈరోజు 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, నిర్మల్ జిల్లా పెంబి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం బయ్యారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలోని తంగులలో 43.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా భైంసాలో 43.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్లలో 43.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ లో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని భోరజ్ లో 43.1 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలోని తొర్రూర్ లో43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News