Andhra Pradesh: ఏపీ హెరిటేజ్ ను కాపాడటం మా పని, తన ‘హెరిటేజ్’ను కాపాడుకోవడం బాబు పని: ప్రధాని మోదీ

  • టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ లకు ప్రజా సంక్షేమం అక్కర్లేదు
  • మా ప్రభుత్వ పనితీరు చూసి నిర్ణయం తీసుకోవాలి
  • దేశం కోసం నిస్వార్థ సేవ చేసే బీజేపీని దీవించాలి

ఏపీ హెరిటేజ్ ను కాపాడటం తమ పని అని, అయితే, తన ‘హెరిటేజ్’ ను కాపాడుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు పని అంటూ ప్రధాని మోదీ విమర్శించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల డేటాను యు-టర్న్ బాబు దొంగిలించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ‘స్టిక్కర్ బాబు’ పేర్లు మారుస్తున్నారని, ఈ ‘స్టిక్కర్ బాబు’కు రైతుల గురించి ఆలోచించే తీరిక లేదని దుయ్యబట్టారు. యు-టర్న్ బాబు తన హెరిటేజ్ సంస్థ కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు.

టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజా సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని, దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే బీజేపీని దీవించాలని కోరారు. 21వ శతాబ్దంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు సహకరించాలని, శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రజలందరూ చేతులు కలపాలని కోరారు. ఉగ్రవాదుల గడ్డపైకి వెళ్లి మరీ వారిపై దాడులు చేశామని, ఈ ఘనత తమ ప్రభుత్వానిదేనని, కొందరు నేతలు మాత్రం పొరుగుదేశానికి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News