Mahesh Babu: 'మహర్షి' డిజిటల్ రైట్స్ ధర 11 కోట్లు!
- వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి'
- కథాకథనాలు .. సంగీతం ప్రధాన బలం
- అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు
'మహర్షి' సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. మహేశ్ బాబు .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ఇద్దరికీ గల క్రేజ్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాకి ముందు మహేశ్ చేసిన 'భరత్ అనే నేను' .. పూజా హెగ్డే నటించిన 'అరవింద సమేత' భారీ విజయాలను అందుకోవడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణమైంది.
దాంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటు పలికాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇందుకోసం ఈ సంస్థ 11 కోట్లను చెల్లించినట్టుగా తెలుస్తోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలం కానున్నాయని అంటున్నారు. ఈ సినిమా మహేశ్ బాబుకి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం ఖాయమనేది అభిమానుల మాట.