sensex: చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. కొనసాగుతున్న లాభాల జోరు
- 39 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
- 185 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 8 శాతం పైగా లాభపడ్డ టాటా మోటార్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా సానుకూలతలు ఉండటం కలసి వచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారి 39వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 39,057కి చేరుకుంది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుని 11,713కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (8.36%), భారతి ఎయిర్ టెల్ (5.08%), టీసీఎస్ (2.37%), బజాజ్ ఫైనాన్స్ (2.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.12%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఆటో (-2.14%), సన్ ఫార్మా (-1.92%), వేదాంత (-0.71%), టాటా స్టీల్ (-0.67%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.55%).