varma: నిజమనేదానికి ప్రూఫ్ లేనప్పుడు ఏది నమ్మదగినదిగా వుంటే అదే నిజం: వర్మ
- ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు
- ఆయన గురించి కొంతమందికి కొన్ని తెలుసు
- ఏ విషయంలోనైనా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా వుంటుంది
తాజాగా 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి మాట్లాడారు. "ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో కొన్ని కీలకమైన మలుపులు వున్నాయి. కొంతమందికి కొన్నిటిని గురించి తెలిసుండొచ్చు .. మరికొంతమందికి కాస్త ఎక్కువ తెలిసుండొచ్చు. చాలామంది లక్ష్మీపార్వతి సూట్ కేసుల్లో బంగారం .. డబ్బు బయటికి పంపించేసిందని నమ్ముతారు. తిప్పరాజు రమేశ్ అనే జర్నలిస్ట్ మాట్లాడుతూ .. అసలు ఇంట్లో డబ్బులే లేవు .. ఆమె ఎలా తీసుకెళుతుంది? అన్నాడు. ఇంకొకరు ఈ రెండింటికి భిన్నంగా మరేదో చెబుతారు.
నా విషయానికే వస్తే నన్ను పిచ్చోడు అనుకునే వాళ్లున్నారు .. జీనియస్ అనుకునేవాళ్లున్నారు. తింగరోడు అంటారు .. మంచివాడు అని కూడా అంటారు. ఇందులో ఎవరూ ఆర్జీవీ అంటే ఇదీ అని పూర్తిగా చెప్పలేరు. అలాగే ఎన్టీఆర్ .. లక్ష్మీపార్వతి విషయంలో కూడా ఒక్కొక్కరూ ఒక్కొక్కరకంగా చెబుతారు. అసలు జరిగింది ఇది అని చెప్పేవాళ్లు లేరు. ఒకవేళ ఎవరైనా చెప్పినా అందులో ఎంతవరకూ నిజముందనేది తేల్చి చెప్పలేం. నిజమనేదానికి ప్రూఫ్ లేనప్పుడు ఏది నమ్మదగినదిగా వుంటే అదే నిజం అని నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చారు.