Nizamabad District: కాంగ్రెస్, బీజేపీలను పారద్రోలేంత వరకూ దేశాభివృద్ధి జరగదు: ఎంపీ కవిత

  • బీజేపీ అంటే ‘భారతీయ జూటా పార్టీ’
  • తెలంగాణలో రూ.1000 పింఛన్ ఇస్తున్నాం
  • ఇందులో కేంద్రం వాటా పెద్దగా లేదు

బీజేపీకి టీఆర్ఎస్ ఎంపీ కవిత కొత్త భాష్యం చెప్పారు. బీజేపీని ‘భారతీయ జూటా పార్టీ’గా అభివర్ణించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛన్ లో కేంద్రం వాటా పెద్దగా లేదని, నలభై ఎనిమిది లక్షల మందికి ఈ పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. అందులో, ఆరు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయలను పింఛన్ కింద ఇస్తుందని వివరించారు. తెలంగాణలో ‘ఇత్తేసి పొత్తు గూడుడు’ అనే ఓ సామెత ఉంది, ఆ సామెతలా కేంద్రం వ్యవహారం ఉందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలను పారద్రోలేంత వరకూ దేశాభివృద్ధి జరగదని అన్నారు. గతంలో తనను ఎంపీగా గెలిపించినందుకు సమస్యల పరిష్కారం కోసం తన శాయశక్తులా కృషి చేశానని, మళ్లీ తనను గెలిపిస్తే ప్రజలకు మరిన్ని మంచిపనులు చేస్తానని కవిత హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News