Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా విధించిన గ్రీన్ ట్రైబ్యునల్
- కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జరిమానా
- ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ
- నివేదిక అందించిన కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు
ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాకిచ్చింది. ఏకంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, ప్రతిరోజు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని గ్రీన్ ట్రైబ్యునల్ కు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు నివేదికను అందించాయి. మరోవైపు, ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా విధించింది.