Telangana: కేసీఆర్ బయోపిక్‌కు అడ్డంకులు.. యూట్యూబ్‌లో విడుదల.. ఎవరైనా ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు

  • ఉద్యమ సింహం విడుదల కాకుండా అడ్డుకుంటున్నారన్న నిర్మాత
  • డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • సంచలన నిర్ణయం తీసుకున్న కల్వకుంట్ల నాగేశ్వరరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్టు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు తెలిపారు. టీఆర్ఎస్ అధినేతగా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాట నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో నాగేశ్వరరావు ఈ ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 29నే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నామని, కానీ కొందరు అడ్డంకులు సృష్టించారని, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను బెదిరించారని ఆరోపించారు. దీంతో ఈ సినిమాను యూట్యూబ్, టీవీ చానళ్లలో ఉచితంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషిని ఈ ‘ఉద్యమ సింహం’లో చూపించే ప్రయత్నం చేశామన్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటుండడంతో కాపీ రైట్ సమస్య లేకుండా ఎవరైనా తమ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసుకునేలా సినిమాను ఉచితంగా విడుదల చేస్తున్నట్టు నాగేశ్వరరావు తెలిపారు.

  • Loading...

More Telugu News