Andhra Pradesh: షర్మిలా.. ఓ మహిళ మాట్లాడాల్సిన భాష ఇదేనా?: నిప్పులు చెరిగిన సీఎం రమేశ్
- షర్మిల మాట్లాడుతున్న భాష ఏంటి?
- ఓ సంస్కృతి, పద్దతి అంటూ మీకు ఏదీ లేదా?
- లోకేశ్ పై విమర్శల నేపథ్యంలో టీడీపీ నేత ఆగ్రహం
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేయడాన్ని టీడీపీ నేత సీఎం రమేశ్ ప్రశ్నించారు.‘అసలు ఎట్లా మాట్లాడుతుంది షర్మిల. ఆ లాంగ్వేజ్ ఏంటి? ఎవరైనా ఏమైనా అంటే తెలంగాణ పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇస్తావు. వాళ్లమో ఇక్కడకు వచ్చి అరెస్టులు చేస్తారు.
ఓ మహిళగా ఉండి, మాట్లాడాల్సిన భాష ఇదేనా? ఓ సంస్కృతి, పద్ధతి అంటూ మీకు ఏదీ లేదా? ఇంతకుమించి నేను చెప్పకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళగా ఉన్న షర్మిల ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తమ గొంతు కోసినా టీడీపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు.