Andhra Pradesh: బాబోయ్.. నేను ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు!: హీరో నిఖిల్
- మా కుటుంబ సభ్యుడు కేఈ ప్రతాప్ డోన్ లో పోటీచేస్తున్నారు
- ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నా
- ఓటు ఐదేళ్లకోసారి వచ్చే ఆయుధం.. సరిగ్గా వాడుకుందాం
తాను ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్త ట్రెండింగ్ అవుతోందని టాలీవుడ్ హీరో నిఖిల్ తెలిపాడు. అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదనీ, తాను ఓ పార్టీకీ సపోర్ట్ చేయడం లేదని నిఖిల్ తేల్చిచెప్పాడు. ఈ విషయాన్ని చెప్పేందుకే ప్రజల ముందుకు వచ్చానని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు నిఖిల్ ఓ వీడియోను విడుదల చేశాడు.
కర్నూలు జిల్లా డోన్ లో తమ కుటుంబ సభ్యుడు కేఈ ప్రతాప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నిఖిల్ తెలిపాడు. కేఈ ప్రతాప్ చాలాచాలా మంచి వ్యక్తి అనీ, నిజాయతీ ఉన్న వ్యక్తి అని వ్యాఖ్యానించాడు. డోన్ ప్రాంతానికి కేఈ ప్రతాప్ గొప్ప సేవ చేశాడని అభిప్రాయపడ్డారు. తనకు కేఈ ప్రతాప్ 25 ఏళ్లుగా తెలుసనీ, అందుకే ఆయనకు ఓటేయాల్సిందిగా ప్రచారం చేశానని స్పష్టం చేశాడు.
చాలామంది మంచి వ్యక్తులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనీ, పార్టీలతో సంబంధం లేకుండా వారందరి తరఫున ప్రచారం చేస్తానని తెలిపాడు. ఓటు హక్కు ఐదేళ్లకు ఓసారి వచ్చే ఆయుధమనీ, దాన్ని సరిగ్గా వాడుతామని పిలుపునిచ్చాడు.
All rumours about @actor_Nikhil bhayya regarding recent political stuff are false. He personally supported his uncle n wished him for the best.
— Chanukya Budaraju (@imchanukya) April 5, 2019
He's no related to any political party.#JaiHind pic.twitter.com/9xHdUOJzCf