ntv: జనసేన మేనిఫెస్టో వేరు... నా విశాఖ మేనిఫెస్టో వేరు... బాండ్ పేపర్ పై రాసి చూపిన లక్ష్మీనారాయణ!

  • సొంత మేనిఫెస్టోను విడుదల చేసిన సీబీఐ మాజీ జేడీ
  • అన్ని సమస్యలూ తీరుస్తా
  • మీడియా ముందు విడుదల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను మించిన అభివృద్ధిని తాను విశాఖపట్నంలో చూపిస్తానని చెబుతూ, ఆ పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి బరిలోకి దిగిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, తన సొంత మేనిఫెస్టోను బాండ్ పేపర్ పై రాసి, దాన్ని మీడియాకు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని ముందుగానే చెబుతానని ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశానని వెల్లడించిన ఆయన, విశాఖ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా చెప్పిన విధంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నానని, ఇందులోని అన్ని అంశాలనూ తాను చేసి చూపిస్తానని అన్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.
ntv
CBI EX JD
Lakshmi Narayana
Manifesto
Vizag

More Telugu News