Andhra Pradesh: తెలంగాణలో నేడు, రేపు.. ఆంధ్రాలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు ఉపరితల ద్రోణి
  • ఓవైపు వానలు.. మరోవైపు మండిపోతున్న ఎండలు
  • ఏపీలో పిడుగులు పడే అవకాశం

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

ఇక, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. శనివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే, మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయి. ఆదిలాబాద్‌లో శనివారం  42.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలులకు తోడు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News