Chandrababu: ఈ విషయంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: చంద్రబాబు
- మేనిఫెస్టోలో నదుల అనుసంధానం గురించి ఏది?
- గ్రామాల్లో ఎవరిని తొలగించి 10 మందిని పెడతారు?
- వీఆర్ఏలనా? వీఆర్వోలనా? ఆశా వర్కర్లనా?
- ట్విట్టర్ లో మండిపడిన చంద్రబాబు
వైఎస్ జగన్ తన మేనిఫెస్టోలో నదుల అనుసంధానం గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "నదుల అనుసంధానం గురించి వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పెట్టాలంటే కెసిఆర్ అనుమతి కావాలా? ఏపి నీటి హక్కులను కాపాడతానని చెప్పలేక పోయాడు. రాష్ట్ర ప్రయోజనాలను కెసిఆర్ కు తాకట్టు పెట్టాడు" అని మండిపడ్డారు. ఆపై "ఇప్పుడు ఎవరిని తొలగించి గ్రామాల్లో 10 మందిని పెడతానని జగన్ అంటున్నాడు..? గ్రామాల్లో వీఆర్ఏ, వీఆర్వో లను తొలగిస్తారా..? అంగన్ వాడిలను,ఆశావర్కర్లను తొలగిస్తారా..?" అని ప్రశ్నించారు.
నదుల అనుసంధానం గురించి @ysjagan ఎందుకు మాట్లాడలేదు?
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2019
YSRCP మేనిఫెస్టోలో పెట్టాలంటే కెసిఆర్ అనుమతి కావాలా?
ఏపి నీటి హక్కులను కాపాడతానని చెప్పలేక పోయాడు.
రాష్ట్ర ప్రయోజనాలను కెసిఆర్ కు తాకట్టు పెట్టాడు.